Christopher Tromp: లండన్ లో 20 ఏళ్ల యువ క్రికెటర్ క్రిస్టోఫర్ ట్రంప్ కారు ప్రమాదంలో మరణించాడు. ట్రంప్ కారు చెట్టును ఢీకొట్టింది. గత వారం శుక్రవారం రాత్రి తన ఆడి A1 కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఈ యువ క్రికెటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర సేవలు అందించినప్పటికీ దురదృష్టవశాత్తు క్రిస్టోఫర్ చనిపోయినట్లు ప్రకటించారు. క్రిస్టోఫర్ స్కెల్మెర్స్‌డేల్ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. క్రిస్ దాదాపు 13 సంవత్సరాలు స్కెల్మెర్స్‌డేల్ క్రికెట్ క్లబ్‌లో భాగమయ్యాడు.
స్కెల్మెర్స్‌డేల్ క్రికెట్ క్లబ్ క్రిస్టోఫర్ కుటుంబానికి సానుభూతిని తెలియజేసింది. అతను తన 20 ఏళ్లలో మంచి క్రికెటర్ గానే కాదు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడింది. మరోవైపు ఈ దుర్ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు.
Read More: Samantha Reaction: శాకుంతలం ఫెయిల్యూర్ పై సమంత రియాక్షన్.. గీతోపదేశం చేస్తూ కౌంటర్!