లక్నో సమీపంలోని చిన్‌హాట్ ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో రూ.17 లక్షల విలువైన క్యాడ్‌బరీ చాక్లెట్ బార్‌లు చోరీకి గురైయ్యాయి. చోరీకి సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం, మంగళవారం మధ్య రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో, తాను చాక్లెట్లు నిల్వ చేయడానికి ఇంటిని గోడౌన్‌గా ఉపయోగిస్తున్నానని, మంగళవారం తన పొరుగువారి నుండి ఇంటి తలుపులు పగులగొట్టినట్లు సమాచారం అందిందని సిద్ధూ చెప్పాడు. దొంగలు గోడౌన్ లో చాకెట్లు దొంగిలించి.. డిజిటల్ వీడియో రికార్డర్ (డివిఆర్), సిసిటివి సెక్యూరిటీ కెమెరాల ఇతర ఉపకరణాలను ఎత్తుకెళ్లారని ఫిర్యాదుదారుడు తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ ప్రాంతంలో అమర్చిన ఇతర సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో రూ.17లక్షల విలువైన చాకెట్లు చోరీ

Cadbury Chocolates Imresizer