Site icon HashtagU Telugu

Chandrababu : నేడు గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యానికి చంద్ర‌బాబు

CBN Tour

chandrababu naidu sabha stampede

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేడు గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంకు వెళ్ల‌నున్నారు. ఇటీవ‌ల వైసీపీ నేత‌ల దాడిలో ధ్వంస‌మైన గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం కార్యాల‌యాన్ని ఆయ‌న సంద‌ర్శించ‌నున్నారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. గ‌న్న‌వ‌రంలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాధితుల‌పైనే కేసులు పెట్టారంటూ పోలీసుల‌పై ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు గ‌న్న‌వ‌రం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. అయితే చంద్ర‌బాబు కార్యాల‌యాన్ని సంద‌ర్శించేందుకు పోలీసులు అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం లేన‌ట్లు తెలుస్తుంది. శాంతిభ‌ద్ర‌త‌లు పేరుతో పోలీసులు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై ఆంక్ష‌లు పెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం

Exit mobile version