Site icon HashtagU Telugu

Chiru Surprise: మహేశ్ కు చిరు సర్ ప్రైజ్.. మ్యారేజ్ డే గ్రీటింగ్స్ ఇలా!

Chiru

Chiru

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కు పెళ్లి జరిగి నేటితో 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. వంశీ సినిమా షూటింగ్ సమయంలోనే మహేశ్, నమ్రత ప్రేమలోపడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నమ్రతను పెళ్లి చేసకున్న తర్వాత మహేశ్ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. నమత్ర ఇంటికే పరిమితం కాకుండా, ఫ్యామిలీ, ఇతర ఆర్థిక లావాదేవీలను చూసుకుంటూ మహేశ్ కు అండగా నిలుస్తున్నారు. కాగా ఇవాళ మహేష్ బాబు నేడు ఏపీ ముఖ్య మంత్రి జగన్ ను కలవడానికి తాడేపల్లి వెళ్లారు. ఈ సందర్భంగా మహేష్ కు ఫ్లైట్ లో పెళ్లిరోజు శుభాకాక్షలు తెలిపారు చిరంజీవి. ఈ ఫొటోలో ప్రభాస్ , రాజమౌళి, కొరటాల శివ తదితరులున్నారు. నమ్రతా కూడా మహేష్ తో ఉన్న పాత ఫొటోలతో వీడియో చేసి షేర్ చేసింది. ఆ వీడియో షేర్ చేసి.. ”మా ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. మా ప్రేమలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇది జీవితాంతం ఉంటుంది.” అంటూ మహేష్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసింది.

Exit mobile version