Site icon HashtagU Telugu

Chiranjeevi Tweet Viral: ఆసక్తి రేపుతున్న ‘చిరంజీవి’ ట్వీట్!

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన ఓ ట్వీట్ ఫిల్మ్ నగర్‌లో సంచలనం సృష్టిస్తోంది. చిరంజీవి తన ట్విట్టర్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలపై తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని అన్నారు. ఆగస్ట్ 5న విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకున్న ‘సీతా రామం, బింబిసార’ చిత్ర బృందాలకు చిరంజీవి అభినందనలు తెలిపారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని ‘సీతా రామం, బింబిసారా’ సినిమాలు నిరూపించాయని అన్నారు. ఇప్పుడు, చిరంజీవి చేసిన ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అంతకుముందు చిరంజీవి షూటింగ్‌కు ముందు ఆర్టిస్టులకు పూర్తి స్క్రిప్ట్ ఇవ్వాలని దర్శకులను కోరిన విషయం తెలిసిందే.