Site icon HashtagU Telugu

MegaStar:తెలుగు సినీ ఇండస్ట్రీపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు

chiranjeevi

chiranjeevi

తెలుగు సినీ ఇండస్ట్రీపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండనని ఆయన ప్రకటించారు.
సినీ పరిశ్రమలోని పలు అంశాలపై వివాదం నడుస్తోన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఈవిధంగా స్పందించడం పొలిటికల్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది.
తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని, ఆ పదవి వద్దని, తాను పంచాయతీలు చేయాలనుకోవట్లేదని చిరు స్పష్టం చేశాడు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకి ఇష్టం లేదని, అనవసర విషయాల్లో తలదూర్చనని తెలిపిన చిరు,
సినీ కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా సాయం అందించడంలో ముందుంటానని తెలిపారు.