Site icon HashtagU Telugu

See Pics: చిరు నెగిటివ్.. ‘బ్యాక్ టు వర్క్‘ అంటూ ట్వీట్!

Chiru

Chiru

టాలీవుడ్ మెగాస్టార్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన కొద్దిరోజుల పాటు హోంక్వారంటైన్ అయ్యారు. ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటూ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయన కు కొవిడ్ నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ బ్యాక్ టు వర్క్ మోడ్ లోకి వచ్చేశారు. ‘‘నేను కోలుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనా నెగిటివ్ అని తేలడంతో వర్క్ కు సిద్ధమవుతున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.

పనిలో భాగంగా దర్శకుడు మోహన్ రాజాతో చిరంజీవి సంభాషణలో మునిగిపోయినట్లు ఫోటోలలో చూడవచ్చు. మరొక ఫోటోలో నటులు, దర్శకులు, నిర్మాతలతో కూర్చున్నట్లు చూడొచ్చు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్‌ఫాదర్‌కి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.