Site icon HashtagU Telugu

Mega Pic: అప్పట్లో ఒకడు ఉండేవాడు!

Chiru

Chiru

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్‌. ఇది అందరికీ తెలిసిందే. సినిమాల కోసం ఆయన పేరు మార్చుకున్నారనే విషయమూ తెలిసిందే. శివశంకర్ వర ప్రసాద్ చిరంజీవిగా మారి తెలుగు చిత్ర పరిశ్రమను శాసించాడు. ఇంతితై అన్నట్టుగా నాటి పునాదిరాళ్ల నుంచి నేటి ఆచార్య వరకు ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలను అందించాడు. తన నటనతో, డాన్సులతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన అభిమానుల్లో గుండెల్లో గూడు కట్టుకున్నాడు. చిరుకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. చిరంజీవి కూడా తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. తాను కాలేజీ డేస్ లో ఎలా ఉన్నాడో తెలిపే ఫొటో ఒకటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ గా మారింది. అన్నయ్యా.. నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.