మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు ముందుకు వచ్చారంటే, తన స్పందన వారిలో వ్యక్తమైనట్టుగా భావిస్తానని పేర్కొన్నారు. అభిమానులు స్పందించడం తనకు ఎనలేని బలం అని చిరంజీవి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన సోదరుడు పవన్ కల్యాణ్ గూర్చి మాట్లాడుతూ.. కొన్ని అంశాల్లో పవన్ కల్యాణ్ స్పందించడం చూస్తుంటే సమంజసంగానే అనిపిస్తుందని వెల్లడించారు. పవన్ కల్యాణ్ న్యాయం కోసమే పోరాడతాడని, న్యాయం కోసమే వాదిస్తాడని కొనియాడారు. అదే న్యాయం కోసం తాను కూడా పోరాడతానని, అయితే సమయం తీసుకుంటానని అన్నారు. మన చిత్తశుద్ధి, నిజాయతీ, సంయమనం విజయాలు అందిస్తాయని చిరంజీవి పేర్కొన్నారు.
