విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu)ను ప్రశంసలతో ముంచెత్తారు. విద్యార్థి దశ నుంచే అంచెలంచెలుగా ఎదిగిన చంద్రబాబు, అనేక సవాళ్లను జయించి ఒక మహానాయకుడిగా నిలిచారని చిరు అభిప్రాయపడ్డారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
చంద్రబాబు పాలనలో ఐటీ రంగానికి ఎంతో ప్రాధాన్యం లభించిందని, ముఖ్యంగా హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడంలో ఆయన దూరదృష్టి ముఖ్యపాత్ర పోషించిందని చిరంజీవి పేర్కొన్నారు. “హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోంది అంటే అది చంద్రబాబు ముందుచూపు వల్లే సాధ్యమైంది. ఆయన వయసుతో కాదు, విజన్‌తో ముందుకు వెళ్లారని” అని మెగాస్టార్ ప్రశంసించారు.
అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చూపిన కృషి ఎంతో గొప్పదని, ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పని చేసే నాయకుడిగా ఆయనను చిరంజీవి కొనియాడారు. మంచి నాయకుడు నడిపినప్పుడు రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చంద్రబాబు నాయుడు అందించిన మార్గదర్శకం చెబుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
