Site icon HashtagU Telugu

Chiru & Keerthy Video: చిరు, కీర్తిల ‘రక్షాబంధన్’.. స్పెషల్ వీడియో రిలీజ్!

Bhola Shankar

Bhola Shankar

సౌత్‌లో మంచి గుర్తింపు ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. చిరు నుంచి వాల్తేరు వీరయ్య, ది గాడ్ ఫాదర్ లాంటి ప్రతిష్టాత్మకమైన సినిమాలు వస్తున్నాయి. అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్స్ లలో భోళా శంకర్ ఒకటి. రక్షా బంధన్ ఆనందకరమైన పండుగను జరుపుకోవడానికి భోళా శంకర్ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు ఈరోజు ట్విట్టర్ లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు.

కీర్తి సురేష్ రాఖీ కట్టి, మెగాస్టార్ చిరంజీవి నుదుటిపై తిలకం పెట్టడం ద్వారా సోదరుడు సోదరి మధ్య ఉన్న సన్నిహిత బంధం వీడియోలో చూడొచ్చు. వీక్షకులకు చిరంజీవి రక్షా బంధన్ శుభాకాంక్షలు చెప్పడం కూడా మనం చూడొచ్చు. ఈ మూవీలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేశ్ నటించడం ఆసక్తిని కల్గిస్తోంది. మొదట్నుంచే ఈ సినిమాపై అంచానాలు ఏర్పడ్డాయి.