Site icon HashtagU Telugu

Minister Roja: చిరంజీవి తాతయ్య అయినందుకు సంతోషంగా ఉంది: రోజా

Mla Roja

Mla Roja

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాతయ్య అయిన విషయం తెలిసిందే. మంత్రి రోజా ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసారు. మెగాస్టార్ చిరంజీవి గారు తాతయ్య అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన తాతయ్య అవ్వోచ్చు. కానీ మాకు మాత్రం ఎప్పటికీ హీరోనే. తాత అనే కొత్త బిరుదు వచ్చినప్పటికీ మాకెప్పుడు ఎవ్వర్ గ్రీన్ హీరోనే. రామ్ చరణ్ చిన్న పిల్లాడి గా ఉన్నప్పుడు ఎత్తుకుని ఆడించాను. ఆక్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు ఆయన కు పాప పుట్టింది అన్న వార్త విని చాలా సంతోషం అనిపించింది.

ఎప్పుడు యవ్వనంగా..శక్తివంతంగా ఉండే ఈ కుటుంబానికి సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడు మెగా ప్రిన్స్ రూపంలో ఆశీర్వాదాన్ని అందించాడు. మెగా ఇంట్లో మహాలక్ష్మి క్షేమం.. కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్ధిస్తు న్నాను. ఉపాసనకి నా శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక చిరంజీవి ఎన్నిసార్లు తాతయ్య అయినా ఆయన ఎప్పటికీ మెగాస్టార్ నే. అభిమానులుకే కాదు ఆయన సహనటులకు అంతే. ఆయన ఎప్పటికీ నా హీరో అంటూ విజయశాంతి కూడా పబ్లిక్ గానే అన్నారు. రాజకీయంగా ఎలాంటి విబేధాలు..విమర్శలున్నప్పటికీ నటుడిగా మాత్రం ఆయన్ని ఎప్పుడు అభిమాని స్తూనే ఉంటానని.. నా హీరో అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు.

Also Read: Submarine: జలాంతర్గామిని కనిపెట్టడం చాలా కష్టమే!