ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో, తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని చర్చలు జరిపారు. 17 అంశాల అజెండాతో వెళ్ళిన సినీ ప్రముఖులు, జగన్‌తో చర్చలు జరపగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి, ఏపీలో సినిమా టికెట్ ధరల రగడకు పుల్‌స్టాప్ పడిందన్నారు. చిన్ననిర్మాతలకు వెసులుబాటు కల్పిస్తూ, ఇకముందు చిన్న సినిమాలు కూడా థియేటర్స్‌లో ఐదో షో వేసుకునేందుకు అనుమతి ఇవ్వడం ఎంతో శుభపరిణామమని, సీఎం జగన్ నిర్ణయం అందరికీ సంతోషాన్ని ఇచ్చిందని చిరంజీవి అన్నారు. ఇక మహేష్ బాబు మాట్లాడుతూ.. ఇండ్రస్ట్రీ సమస్యలపై చిరంజీవి చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెల్పుతూ.. వారం రోజుల్లో అందరం గుడ్ న్యూస్ వింటామని మహేష్ బాబు అన్నారు.