Site icon HashtagU Telugu

Chintamaneni Prabhakar : కోడిపందెం న్యూస్ ట్రాష్: చింత‌మ‌నేని

Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar

కోడిపందెం ఆడాన‌ని కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేయ‌డాన్ని మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ త‌ప్పుబ‌ట్టారు. ఏదైనా డైరెక్ట్ ఎదుర్కోవాల‌ని ప్రత్య‌ర్థ‌లుకు స‌వాల్ విసిరారు.హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో జరిగిన కోడిపందాల వెనుక ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. తప్పుడు వ్యూహాలతో యుద్ధం చేయకుండా నేరుగా రాజకీయాలతోనే రావాల‌ని కోరారు.హైదరాబాద్ శివారు పటాన్‌చెరులో జరిగిన కోడిపందాల కార్యక్రమంలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కొందరు తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, దురుద్దేశంతో విషం చిమ్మకుండా రాజకీయంగా సమస్యలను పరిష్కరించాలని ప్రత్యర్థులను కోరారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వాళ్లను దింపేయాల‌ని ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నార‌ని అన్నారు. ప్రజల ఆగ్రహాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ చవిచూడాల్సి వచ్చిందన్నారు.