Fractured Ribs: వింత ఘటన.. దగ్గినందుకు నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయట.. ఎక్కడో తెలుసా?

మన శరీరంలోని పక్కటెముకలు ఎంత దృడంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి పక్కటెముకలు విరగడం

  • Written By:
  • Publish Date - December 8, 2022 / 06:00 PM IST

మన శరీరంలోని పక్కటెముకలు ఎంత దృడంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి పక్కటెముకలు విరగడం మామూలు విషయం కాదు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఆ పక్కటెముకలు విరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఎముకలు విరుగుతాయ్ తప్ప ఉత్తి పుణ్యానికి ఎముకలు విరగడం అన్నది జరగడం అసంభవం. లేదంటే కొన్ని కొన్ని సార్లు జన్యు లోపం కారణంగా బలహీనపడి ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక మహిళ దగ్గినందుకు ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

పూర్తి వివరాల్లోకెళ్తే…చైనాలోని షాంఘైకి చెందిన హువాంగ్‌ అనే మహిళకు దగ్గినందుకు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయి. ఒక రోజు ఆమె స్పైసీ ఫుడ్‌ తింటుండగా ఆమెకు విపరీతమైన దగ్గు వచ్చింది. అప్పుడూ ఆమెకు ఏదో లోపల విరిగిన శబ్దం రావడంతో ఆమె మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత నుంచి ఆమె గాలి పీల్చినా మాట్లాడినా కూడా చెస్ట్ దగ్గర విపరీతమైన నొప్పి రావడంతో వెంటనే ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు స్కాన్ చేయగా ఆమెకు నాలుగు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు. అనంతరం ఆ మహిళలకు బ్యాండ్ వేసి నయం అయ్యేంతవరకు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు.

అయితే తగ్గితే పక్కటెముకలు విరగడం ఏంటి అన్న కలకలం రేగడంతో అందుకు ఆ మహిళ బరువు తక్కువగా ఉండటమే కారణం అని వైద్యులు తేల్చి చెప్పారు. సదరు మహిళ 171 సెంటిమీటర్లు పొడవు ఉంటుందని, బరువు కేవలం 57 కేజీలు మాత్రమే ఉందని ఆమె శరీరంలో పైభాగం చాలా బలహీనంగా ఉండటమే గాక శరీరం నుంచి ఎముకలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. ఎముకలకు మద్దతు ఇచ్చేలా కండ లేకపోవడంతో.. దగ్గినప్పుడల్లా పక్కటెముకలు సులభంగా విరిగిపోతాయని తెలిపారు వైద్యులు. ఆ మహిళా ఈ విషయంపై స్పందిస్తూ ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత బరువు పెరగడానికి ప్రయత్నిస్తానని ఆ మహిళ తెలిపింది.