G20 Summit: జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు డుమ్మా

భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరుకావడం లేదు. ఆయన స్థానంలో ప్రధాని లీ కెకియాంగ్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ రానున్నారు

G20 Summit: భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరుకావడం లేదు. ఆయన స్థానంలో ప్రధాని లీ కెకియాంగ్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ రానున్నారు. చైనా విదేశాంగ శాఖ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత్‌లో పర్యటించలేనని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జి-20 సదస్సు భారత్‌లో జరగనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో దీన్ని నిర్వహించనున్నారు.

అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, UK, US మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు పాల్గొంటాయి.

Also Read: 11 Arrested: పంజాగుట్టలో హుక్కా సెంటర్ పై దాడి, 11 మంది అరెస్ట్