Site icon HashtagU Telugu

China Debt Trap : డ్రాగన్ లోన్ ట్రాప్ లో పాక్..మరో 8100 కోట్ల రుణం

China Debt Trap

China Debt Trap

China Debt Trap : పేద దేశాలకు లోన్ ట్రాప్ వేయడంలో చైనా బిజీగా ఉంది.   

ఈక్రమంలోనే పాకిస్తాన్ కు మరో రూ.8100 కోట్ల లోన్ ఇచ్చింది. 

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాం ఆదుకోండి అని పాక్ కోరడంతో చైనా ఈ లోన్ ఇచ్చింది.  ఈవిషయాన్ని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కూడా ధృవీకరించింది.  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)కి కూడా చైనా లోన్ అప్లికేషన్ పెట్టుకుంది. బెయిలౌట్ ప్రోగ్రామ్ ద్వారా రూ.10వేల కోట్ల లోన్ ఇచ్చి ఆదుకోవాలని కోరింది. అయితే అది మంజూరు కావడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ వద్ద ఒక నెల దిగుమతులకు సరిపడా కరెన్సీ నిల్వలు లేవు. దీంతో చైనా తలుపు తట్టింది. డ్రాగన్ వెంటనే రూ.8100 కోట్ల లోన్ మంజూరు చేసింది. రూ.16వేల కోట్ల కరెన్సీ స్వాప్ (మార్పిడి)  కోసం కూడా చైనా-పాక్  చర్చలు జరుపుతున్నాయి.

చైనా లోన్ ట్రాప్ గురించి తెలుసా ?

ప్రపంచంలోని పేద దేశాలకు భారీగా లోన్స్(China Debt Trap) ఇస్తున్న ధనిక దేశాల్లో చైనా ఒకటి. గత పదేళ్లలో 40కి పైగా పేద దేశాలకు చైనా రూ.13 లక్షల కోట్ల లోన్స్ ఇచ్చింది. చైనా ఇచ్చిన రుణాలు ఆయా దేశాల వార్షిక జీడీపీకి 10 శాతానికి మించిపోయాయి. ఇప్పుడు పాక్ పరిస్థితి కూడా అలాగే ఉంది.  బిబౌటీ, లావోస్, జాంబియా, కిర్గిజ్ స్తాన్ దేశాల్లో చైనా రుణాలు వాటి వార్షిక జీడీపీలో 20 శాతానికి మించిపోయాయి. దీంతో చైనా దగ్గర భారీగా అప్పులు చేసిన దేశాలు.. వాటిని తీర్చలేక ఆ దేశం చేసే ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తోంది. పాక్ కూడా ఇదే విధంగా చైనా చేతిలో కీలుబొమ్మలా మారింది. పాకిస్తాన్ లోని కీలకమైన ఓడరేవులు ఇప్పుడు చైనా ఆర్మీ చెప్పు చేతల్లో ఉన్నాయి. అమెరికా, రష్యాలను కాదని..  చైనా నుంచి పాకిస్తాన్ భారీగా ఆయుధాలు కొనడానికి ప్రధాన కారణం కూడా ఈ అప్పులే.  పాక్ లో ఏర్పడే ప్రభుత్వాలు తీసుకునే కీలక నిర్ణయాలపై కూడా చైనా ప్రభావం ఉంటుందనేది వాస్తవం.