China Heat: చైనాలో విపరీతమైన వేడి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని వాయువ్య రాష్ట్రాల్లో గరిష్టంగా 52 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలు నమోదయ్యాయి. ఆరు నెలల క్రితం చైనా ప్రజలు మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండగా… ఇప్పుడు అక్కడ ఉష్ణోగ్రత 52.2 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని అధికారిక వార్తాపత్రిక జిన్‌జియాంగ్ డైలీ సోమవారం నివేదించింది. రాబోయే ఐదు రోజుల పాటు రికార్డు వేడి కొనసాగుతుందని అంచనా. అంతకుముందు 2015లో ఐడింగ్ సమీపంలో 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
ఏప్రిల్ నుండి ఆసియాలోని అనేక దేశాలు రికార్డు స్థాయిలో వేడిగాలుల పట్టి పీడిస్తున్నాయి, వేగంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా వాటి సామర్థ్యం గురించి ఆందోళనకు గురి చేస్తుంది. చైనాలో అధిక ఉష్ణోగ్రతలు అక్కడ వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కరువు పునరావృతమయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Errabelli Dayakar Rao: ఎర్రబెల్లి ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా