Site icon HashtagU Telugu

Mission Moon: త్వరలో చంద్రుడి పై చైనా రిసెర్చ్ సెంటర్!

Nuclear Power Plant On Moon

Moon

చంద్రుడి పై రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు కు చైనా రెడీ అవుతోంది. ఈ దిశగా కసరత్తు ను ముమ్మరం చేసింది. చాంగీ-8 మిషన్ లో భాగంగా త్వరలో చంద్రుడి పై రిసెర్చ్ సెంటర్ ను నిర్మిస్తామని చెబుతోంది. ప్రస్తుతం చాంగీ-6 మిషన్ పురోగతి లో ఉంది. ఇందులో భాగంగా.. భూమి నుంచి మనకు కనిపించని చంద్రుడికి వెనుక ప్రాంతం నుంచి ఉపరితల శాంపిళ్ళను సేకరించి, తెప్పించే పనిలో నిమగ్నమైంది. వాస్తవానికి 2019 జనవరిలోనే తొలిసారిగా చైనా కు చెందిన చాంగీ-4 లూనార్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి వెనుక భాగంలో దిగింది. నాటి నుంచే ఆ ప్రాంతపు స్వరూప స్వభావాలపై చైనా అధ్యయనం ప్రారంభించింది. ఈవిషయంలో అమెరికా, ఐరోపా, రష్యా లకు ధీటుగా పావులు కదుపుతోంది. భవిష్యత్ లో చంద్రుడి పై తన వంతు వాటా ను దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది.

ఆ రెండు శాటిలైట్లు ఎందుకంటే..

తాజాగా శుక్రవారం రోజున చైనా సీవీ 01, సీవీ 02 అనే రెండు ఉపగ్రహాలను విజయవంతం గా ప్రయోగించింది. పర్యావరణ పరిరక్షణ, నగరాల భద్రతతో ముడిపడిన సేవలు అందించే కంపెనీలకు ఇవి రిమోట్ సెన్సింగ్ సేవలు అందిస్తాయి.

Exit mobile version