China: చైనాని కూడా ముంచెత్తుతున్న వరదలు.. రికార్డు స్థాయిలో వర్షపాతం?

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా నదులు

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 04:50 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా నదులు వాగులు వంకలు చెరువులు పొర్లి పొంగుతున్నాయి. ఈ వరదలు దాటికి లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా నీట మునుగుతున్నాయి. పదుల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు. ఇప్పటికే భారత దేశంలోనే ఉత్తరాది ప్రాంతంలోని ప్రజలు వర్షాలకు వరదల దెబ్బకు ఒలిగిపోతున్నారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ, ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాలలో అక్కడి నదులు యమునా గంగా నదులు ఉగ్రరూపం దాల్చాయి.

ఇది ఇలా ఉంటే కేవలం భారత్లో మాత్రమే కాకుండా తాజాగా చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో గల మైన్‌యాంగ్‌ సిటీ నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్‌యాంగ్‌లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదేవిధంగా చైనాలోని చోంగ్‌కింగ్‌ నగర పరిధిలో 9,700 మంది తుపాను బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. మీడియా ఏజెన్సీ షిన్హువా తెలిపిన వివరాల ప్రకారం చోంగ్‌కింగ్‌ పరిధిలోని 41 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను కారణంగా పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.

వాన్‌ఝోవూలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 227 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాన్‌ఝోవూ విపత్తు నియంత్రణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 300 హెక్టార్లలోని పంటపొలాలు నీట మునిగాయి. ఇ‍ళ్లు నీట మునగడంతో వందల మంది నిరాశ్రయులుగా మారారు. వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని రెస్క్యూ బృందాలు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాంతో చైనాలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఈ వర్షాలు కారణంగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.