Site icon HashtagU Telugu

China New Map Vs India : అరుణాచల్, ఆక్సాయ్ చిన్ చైనావేనట.. డ్రాగన్ ‘కొత్త మ్యాప్’ పై దుమారం !

China New Map Vs India

China New Map Vs India

China New Map Vs India :  బార్డర్  లో ఉన్న దేశాలను కవ్వించడమే చైనా పనిగా పెట్టుకుంది. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించడమే లక్ష్యంగా ఆ దేశం పావులు కదుపుతోంది. ఈక్రమంలో లేటెస్ట్ గా విడుదల చేసిన చైనా మ్యాప్  లో మన భారతదేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ లను కూడా చేర్చుకుంది. తద్వారా భారత్ ను మరోసారి కవ్వించే యత్నానికి డ్రాగన్ పాల్పడింది. చైనా అధికారిక వార్తా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ ఈ కొత్త మ్యాప్ ను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వివాదాస్పద మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ తో పాటు తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాలు కూడా తమ భూభాగాలేనని చైనా చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ అనేది టిబెట్ ప్రాంతంలో భాగమని చైనా వాదించింది. చైనా సహజ వనరుల శాఖ వెబ్ సైట్ లోనూ ఈ మ్యాప్ ను పొందుపరిచారని ‘గ్లోబల్ టైమ్స్’ ఆ పోస్ట్ లో తెలిపింది. ఈ మ్యాప్ చైనా, ప్రపంచంలోని వివిధ దేశాల జాతీయ సరిహద్దుల డ్రాయింగ్ పద్ధతి ఆధారంగా రూపొందించారని చెప్పింది.

Also read : China Drops COVID-19 Test: చైనా కీలక నిర్ణయం.. ఇకపై ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష అవసరం లేదు..!

అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను మారుస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించడం ద్వారా చైనా ప్రభుత్వం భారత్ తో సరిహద్దు  వివాదానికి తెరలేపింది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు దగ్గరగా ఉన్న ఒక నగరం తమదేనని అప్పట్లో చెప్పింది. అంతర్యుద్ధం కారణంగా 1949లో చైనా నుంచి తైవాన్ విడిపోయింది. ఇప్పుడు ఆ  తైవాన్ ను తమదేనని క్లెయిమ్ చేసుకోవడం గమనార్హం.  రానున్న రోజుల్లో సైనిక బలప్రయోగంతో తైవాన్ ను కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని చైనా ప్లాన్ చేస్తోందట. ఐదు రోజుల క్రితమే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా  చైనా అధ్యక్షుడు   షి జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా సరిహద్దు వివాదంపై చర్చ జరిగింది.  ఇది జరిగి కనీసం వారమైనా గడవక ముందే.. మళ్లీ ఈవిధంగా (China New Map Vs India) అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ లపై  కొత్త మ్యాప్ తో చైనా రగడను క్రియేట్ చేయడం గమనార్హం.