చైనా లోని జియాన్ ప్రాతంలో గురువారం నుండి లాక్ డౌన్ విధించనున్నారు. చైనాలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. డెల్టా వేరియెంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో దాదాపు కోటి 30 లక్షల మంది ప్రజలు లాక్ డౌన్లో ఉండనునట్టు అంచనా. నిత్యావసర సరుకులకోసం, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో ఒక కుటుంబం నుండి కేవలం ఒక వ్యక్తినే అనుమతించనున్నారు. చైనాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
China: లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
