Teacher Hanged : ఒక కీచక టీచర్ కు చైనా ఉరి శిక్ష వేసింది.
25 మంది స్టూడెంట్స్ కు విషమిచ్చి.. వారిలో ఒకరి మరణానికి కారణమైనందుకు ఆమెను ఉరితీసింది.
గురువారం ఆమెను ఉరితీయగా .. ఆ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది..
ఇంతకీ ఏమిటీ కేసు ? ఆమె స్టూడెంట్స్ కు ఎందుకు విషం ఇచ్చింది ?
చైనాలోని హెనాన్ ప్రావిన్స్ కు చెందిన వాంగ్ యున్ ఒక కిండర్ గార్టెన్ టీచర్.. మెంగ్‌మెంగ్ ప్రీ స్కూల్ లో పనిచేసేది.. 40 ఏళ్ల వయసున్న ఆమె క్రూరంగా, రాక్షసంగా ఆలోచించింది. తాను క్లాస్ చెప్పే కిండర్ గార్టెన్ స్టూడెంట్స్ కు 2019 మార్చి 27న గంజిలో విషపూరితమైన సోడియం నైట్రేట్‌ను కలిపి ఇచ్చింది. ఆ గంజి తాగిన స్కూలు పిల్లలలో ఒకరు మృతిచెందారు. మిగితా విద్యార్థులు 10 నెలల ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్నప్పటికీ.. వాళ్ళ బాడీలోని చాలా అవయవాల పనితీరు దెబ్బతింది. అందుకే ఈ కేసును హెనాన్ ప్రావిన్స్‌లోని జియాజువో నగరంలో ఉన్న నెం. 1 ఇంటర్మీడియట్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. వాంగ్ యున్ కు మరణ శిక్ష విధించింది. దీన్ని గురువారం (జులై 13న) అమలు చేశారు.
Also read : Hyderabad-Skyroot : హైదరాబాద్ “స్కై రూట్” రాకెట్లతో ఫ్రాన్స్ శాటిలైట్ల మోహరింపు.. ఖరారైన డీల్
ఎందుకు అలా చేసింది ?
అంతకుముందు వాంగ్ యున్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. గతంలో ఒకసారి తన భర్తకు కూడా ఇదే విషం(సోడియం నైట్రేట్) కలిపి ఇచ్చానని చెప్పింది. అయితే తన భర్త కొద్దిపాటి అస్వస్థతతో బయటపడ్డాడని తెలిపింది. ఈ రెండుసార్లు కూడా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే తాను అన్నంలో విషం కలిపానని పోలీసు దర్యాప్తులో వాంగ్ యున్ ఒప్పుకుంది. “స్టూడెంట్స్ ను క్లాస్ రూంలో మెయింటైన్ చేసే విషయంలో నాకు మరో టీచర్ తో జరిగిన గొడవను మనసులో ఉంచుకొని.. ఆ క్లాస్ లోని పిల్లలు తినే అన్నంలో విషం కలిపాను” అని పోలీసులకు వాంగ్ యున్ చెప్పింది. దీంతో ఆమెను కోర్టు దోషిగా 2019లోనే ఖరారు చేసింది. అయితే ఆమెకు మరణశిక్షను విధిస్తూ ఈవారంలోనే తీర్పును ఇచ్చింది.
Also read : Rafale Jet: భారత్, ఫ్రాన్స్ మధ్య భారీ రక్షణ ఒప్పందం.. 26 రాఫెల్ జెట్‌ల కొనుగోలుకు భారత్ ఆమోదం..!
ఉరివేశారా ? కాల్చి చంపారా ?
వాంగ్ యున్ కు మరణ శిక్ష ఎలా వేశారనే దానిపై ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. అయితే శిక్షను అమలు చేయడానికి ముందు వాంగ్ ను జైలు అధికారులు ఉరితీసే గ్రౌండ్ కు తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి. బుల్లెట్‌తో తల వెనుక భాగంలో కాల్చి కూడా చైనాలో మరణశిక్షను అమలు చేస్తుంటారు. కొన్ని కేసులలో మరణ శిక్ష అమలుకు ప్రాణాంతక ఇంజెక్షన్‌లు ఇస్తుంటారు. ప్రపంచంలోని మిగిలిన దేశాల కంటే చైనా ఎక్కువగా మరణశిక్షలను అమలు చేస్తోంది. అయితే మీడియాపై ఉన్న సెన్సార్ కారణంగా ఆ వివరాలు ఎక్కువగా బయటికి రావు.