దేశంలో పావురాళ్ల కలకలం సృష్టిస్తున్నాయి. గత కొంత కాలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కాళ్లకు ట్యాగ్ ఉన్న పావురాలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఒడిశా, ఆంద్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో, అలాగే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కాళ్ళకు రబ్బరు ట్యాగ్స్ ఉన్న పావురాలు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీలోని నెల్లూరు జిల్లా కలవాయి మండలం కల్లూరు గ్రామ్ చైనీస్ బార్‌కోడ్‌తో ఉన్న పావురం ఒకటి కనిపించింది.
కల్లూరు గ్రామంలోని బజారువీధిలో ఒక భవనంపై ఎక్కువ సమయం ఉన్న తెల్ల పావురాన్ని చూసిన యువకులు, దాన్ని పట్టుకున్నారు. అయితే ఆ పావురం ఒక కాలికి బ్యాడ్జ్, మరో కాలికి చైనీస్ బార్ కోడ్ ఉంది. ఇది దేనికి సంబంధించింది ఉంటుందోనని తర్జనభర్జన పడ్డామని స్థానికులు, ఈ విషయాన్ని అక్కడా స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఇక మరోవైపు చెన్నై, గూడూరు పరిసర ప్రాంతాలలో పావురాల పరుగు పందేలు నిర్వహించే వారి నుంచి ఇది తప్పించుకొని వచ్చిందేమోనని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు.