Site icon HashtagU Telugu

Building: 27 అంతస్తుల భవనంపై పిల్లల విన్యాసాలు.. చూస్తే గుండె గుబేల్!

Buidin

Buidin

Building: 27 అంతస్తుల భవనం అంచుల్లో పిల్లలు ఆడుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇద్దరు పిల్లలు 27 అంతస్తుల భవనంపై ప్రమాదకర స్థాయిలో విన్యాసాలు చేస్తున్నారు. గుండె గుబేల్‌మనేలా ఆ వీడియో ఉంది. నెట్టింట ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుుతోంది. 27 అంతస్తుల ఉన్న రెండు భవనాలపై అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఇద్దరు పిల్లలు దూకారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.

చైనాలోని హుంబే ప్రావిన్స్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే. ఇద్దరు మైనర్ బాలురు 27 అంతస్తులు ఉన్న భవనంపైకి ఎక్కారు. పక్కనే అదే ఎత్తులో మరో భవనం ఉంది. రెండు భవనాలపైనుంచి ఒక్కనుంచి మరో మరోపక్కకు దూకుతూ కనిపించారు. ఇవి గమనించిన కొంతమంది వ్యక్తులు మేనేజ్‌మెంట్ కు సమాచారం ఇచ్చాడు. దీంతో పిల్లలను అక్కడ నుంచి కిందకు దించారు. అయితే ఈ ఘటన 2021లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీడియో ఇప్పడు వైరల్ గా మారింది. ఓన్లీబ్యాంగర్స్ అనే ట్విట్టర్ ఖాతాలో తాజాగా వీడియోను పోస్ట్ చేశారు.

ఈ క్రమంలో వీడియో మరోసారి వైరల్‌గా మారింది. పిల్లలు స్టంట్స్ చేస్తుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో చూస్తే పిల్లల స్టాంట్స్ ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పటివరకు 23 లక్షల మంది వీడియోను చూశారు. పిల్లల విన్యాసాలు చూస్తే గుండె గుబేలుమంటుంది. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ఒక్కొక్కసారి విషాదకర పరిస్థితులకు దారితీస్తాయి. దీంతో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుందని అంటున్నారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. దీంతో పిల్లలన తల్లిదండ్రులక గమనిస్తూ ఉండాలని, ఆడుకునేటప్పుడు గమనిస్తూ ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Exit mobile version