Site icon HashtagU Telugu

27 Dead in Kanpur: కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా.. 27 మంది మృతుల్లో 11 మంది చిన్నారులే!!

Accident Imresizer (1)

Accident Imresizer (1)

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది చనిపోయారు. రోడ్డుపై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో 11 మంది చిన్నారులు, 11 మంది మహిళలు సహా మొత్తం 27 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. యాత్రికులతో ట్రాక్టర్ ట్రాలీ ఉన్నావ్ పట్టణం నుంచి తిరిగి వస్తోంది. కాన్పూర్ జిల్లాలోని ఘతంపూర్ ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడి ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ప్రధాని కార్యాలయం ట్వీట్​ ..

ఈ ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనపై ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ట్వీట్​ ద్వారా సమాచారం వచ్చింది. ఈ విషయంలో తాను ఎంతో బాధపడ్డానని ప్రధాని చెప్పారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పీఎంవో కోరింది. మరణించిన ప్రతి ఒక్కరికి పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్టు పీఎంవో తెలిపింది. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సాయం అందించనున్నారు.

యోగి ఆదిత్యనాథ్ ట్వీట్​

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఓ ట్వీట్​ చేశారు.. “కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకం..  జిల్లా మేజిస్ట్రేట్, ఇతర అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించాం. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చూస్తాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్​ చేశారు.