India: లోక్ సభలో బాల్యవివాహాల నిరోధక చట్టం(సవరణ) బిల్లు

  • Written By:
  • Updated On - December 21, 2021 / 03:22 PM IST

బాల్యవివాహాల నిరోధక చట్టం(సవరణ) బిల్లు 2021ను లోక్ సభలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మ్రితి ఇరానీ ప్రవేశపెట్టారు. అమ్మాయిల కనీస వివాహ వయసును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట్టం (1954), బాల్య వివాహాల నిరోధక చట్టం (2006), హిందూ వివాహ చట్టం(1955)లో కూడా తగిన సవరణలు చేయనున్నారు. ప్రభుత్వాన్ని మెజారిటీ ఉన్న నేపథ్యంలో బిల్ లోక్ సభ ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిల్లును స్టాండింగ్ కమిటీ కి పంపుతున్నట్టు మంత్రి సభకు తెలిపారు.