Murder in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గొడ్డలితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి, ఆపై ఉరి వేసుకున్నాడు. ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
హంతకుడు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై గొడ్డలితో దారుణంగా దాడి చేసి ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే ఆ దారుణానికి కారణమని స్థానికులు అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈ ఘటనపై సారన్‌గఢ్ బిలాయిగఢ్ జిల్లా సూపరింటెండెంట్ పుష్కర్ శర్మ సమాచారం అందించారు. ఈ మారణకాండలో మరణించిన వారి పేర్లు హేమ్‌లాల్, జగ్మతి, మీరా మరియు మీరా కొడుకు మరియు ఇద్దరు పిల్లలు అని ఆయన చెప్పారు. ప్రాథమిక విచారణలో హంతకుడు పొరుగునే ఉన్న పప్పు టేలర్‌గా చెబుతున్నారు. విచారణ తర్వాతే ఈ వ్యవహారంపై మరింత సమాచారం అందుబాటులోకి రానుంది.
Also Read: Palnadu Politics : పల్నాడు ఫలితాలు ఇప్పటికే డిసైడ్ అయ్యాయా..?