Chikoti Praveen: పరారీలో చీకోటి ప్రవీణ్

క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. క్యాసినో కేసులో థాయిలాండ్ పోలీసులు అరెస్ట్, మనీలాండరింగ్ కేసుతో

Published By: HashtagU Telugu Desk
Chikoti Praveen

New Web Story Copy 2023 07 19t161942.598

Chikoti Praveen: క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. క్యాసినో కేసులో థాయిలాండ్ పోలీసులు అరెస్ట్, మనీలాండరింగ్ కేసుతో బాగా పాపులర్ అయిన చికోటి ప్రవీణ్ తాజాగా హైదరాబాద్ లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా మహంకాళి ఆలయానికి చీకోటి ప్రవీణ్ మరియు అతని ప్రైవేట్ సెక్యూరిటీ వచ్చారు. ఆ సమయంలో ప్రవీణ్ సెక్యూరిటీ వద్ద తుపాకులు ఉండటం గమనించిన పోలీసులు ముగ్గురు సెక్యూరిటీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్ రిపోర్టులో ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు రాకేష్ కుమార్, సుందర్ నాయక్, రమేష్ గౌడ్ లు గా పేర్కొన్నారు. అయితే ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. అతడు గోవాకు పారిపోయి దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

Read More: Rajasingh & Etela: సస్పెన్షన్‌పై ఈటలతో చర్చించలేదు : ఎమ్మెల్యే రాజాసింగ్

  Last Updated: 19 Jul 2023, 04:21 PM IST