కర్నాటకలో అమానుష ఘటన చోటుచేసుకుంది. చిక్కబళ్లాపూర్ జిల్లాలో 14ఏళ్ల దళిత చిన్నారిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతామణి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశాడన్న అనుమానంతో బాలుడిని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. కెంపేనహళ్లిలో నివాసముంటున్న యశ్వంత్ తన వయసులో ఉన్న ఇతర అబ్బాయిలు, అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు. అగ్రవర్ణ బాలిక నుంచి యశ్వంత్ బంగారు చెవిపోగులు దొంగిలించాడన్న అనుమానంతో యశ్వంత్ ఈడ్చుకెళ్లి విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
తల్లిని కూడా కొట్టారు
కుమారుడిని కాపాడేందుకు వచ్చిన బాలుడి తల్లిని కూడా తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన యశ్వంత్‌తో పాటు అతని తల్లిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధిత బాలుడు, అతని తల్లి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.