Site icon HashtagU Telugu

chicken prices: భగ్గుమంటున్న చికెన్ ధరలు!

Chiken

Chiken

తెలంగాణలో చికెన్ ధరలు భగ్గమంటున్నాయి. ఒక కిలో మాంసం కిలో రూ. 280కి అమ్ముడవుతోంది. అదే గత నెలలో కిలో రూ.180 ధర ఉంది. దేశవ్యాప్తంగా కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ధర పెరగడానికి ఒక కారణమని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని వచ్చే కొన్ని నెలల పాటు ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని కోళ్ల పెంపకందారుల సంఘం అభిప్రాయపడింది. “వేసవిలో కోడి మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా కరోనా, లాక్‌డౌన్ల కారణంగా భారీ నష్టం జరిగింది. ప్రస్తుతం కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతోంది’’ అని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు.