Site icon HashtagU Telugu

Hyderabad : క‌స్ట‌మ‌ర్‌పై క‌త్తితో దాడి చేసిన చికెన్‌ పకోడీ షాప్ యాజ‌మాని

Knife Imresizer

Knife Imresizer

హైదరాబాద్‌లో చికెన్ పకోడీ దుకాణం యజమాని ఓ కస్టమర్‌పై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బాధితుడు నాగార్జునగా గుర్తించబడ్డాడు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు 9వ ఫేజ్‌లో ఉన్న JS చికెన్ పకోడీ సెంటర్‌కి వెళ్లిన నాగార్జున‌ చికెన్ పకోడీలో ఘాటు ఎక్కువైందని షాపు యజమాని జీవన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన జీవన్.. క‌స్ట‌మ‌ర్ నాగార్జునను తిట్టాడు.దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఒక‌రిని ఒక‌రు కొట్టుకునేలా ప‌రిస్థితి మారింది. అదే స‌మ‌యంలో షాప్ యజమాని.. క‌స్ట‌మ‌ర్‌ నాగార్జునపై కత్తితో దాడి చేయగా, అతడి స్నేహితుడు ప్రణీత్ రెడ్డి కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘ‌ట‌న‌లో బాధితుడు నాగార్జున‌కి గాయాలు కావ‌డంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.