Site icon HashtagU Telugu

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ లో 10 మంది నక్సలైట్లు హతం

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్రంలోని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది నక్సలైట్లు మరణించారు. సోమవారం రాత్రి నుంచి అబుజ్‌మద్‌లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్త బృందం రాత్రంతా 45 కిలోమీటర్లు కుమ్బింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా నక్సలైట్లను గురించిన భద్రత బలగాలు భీకరంగా కాల్పులు జరిపాయి. ఎన్‌కౌంటర్‌లో లో 10 మంది మావోలు కాల్పులకు బలయ్యారు. ఇందులో ముగ్గురు మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు. చనిపోయిన నక్సలైట్లను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం ఆపరేషన్‌లో భద్రతా దళ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్, మందుగుండు సామాగ్రి, నక్సల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

We’re now on WhatsAppClick to Join

ఈ నెలలో కంకేర్ జిల్లాలో భద్రతా దళాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయాయి. ఘటనా స్థలం నుంచి తొలిసారిగా భారీ మొత్తంలో రేషన్‌తో పాటు జేసీబీ యంత్రాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నక్సలైట్లు జేసీబీని ఉపయోగించి అడవిలో బంకర్లను నిర్మించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది. గత నాలుగు నెలల్లో రాష్ట్రంలో 97 మంది నక్సలైట్లు హతమయ్యారు. నక్సలైట్ల ఉనికి గురించి సమాచారం అందిన ప్రతిచోటా భద్రతా దళాల బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Also Read: Bihar : అయ్యో అని అల్లుడ్ని చేరదీస్తే..అత్తానే లైన్లో పెట్టి పెళ్లి చేసుకున్నాడు