Site icon HashtagU Telugu

Chennai Court: జైభీమ్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడికి షాక్

Surya

Surya

త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన జైభీమ్ చిత్రంలోని క్యాలెండ‌ర్ సీన్‌పై గ‌తంలో వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. దీనిపై వ‌న్నియార్ క‌మ్యూనిటీ అభ్యంత‌రం తెలుసుతూ ఆ సంఘం నేత‌లు గ‌తేడాది నవంబ‌ర్‌లో చెన్నై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ సీన్‌ను తొలగించాలని కోరారు. ఆ పిటిషన్‌ను సైదాపేట కోర్టు విచారణ జరిపింది. హీరో సూర్య, ఆయ‌న‌ భార్య జ్యోతిక, దర్శకుడు టీజే.జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని కోర్టు చెన్నై పోలీసులను ఆదేశించింది. కేసును దర్యాప్తు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది. సినిమా విడుదలైప్పుడే ఆ సీన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వన్నియార్ సంఘం సూర్య, టీజే. జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్‌కు లీగల్ నోటీసులు పంపించింది. రూ. 5కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది.

Exit mobile version