Couples Death: ఫోటోషూట్ సంబరంలో హనీమూన్ కపుల్.. ఒక్కసారిగా బోటు బోల్తా పడటంతో?

ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ఫోటోషూట్స్ అన్నవి శ్రుతి మించిపోయాయి. చాలామంది ఈ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కోసం ప్రాణాల మీద కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పట

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 02:55 PM IST

ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ఫోటోషూట్స్ అన్నవి శ్రుతి మించిపోయాయి. చాలామంది ఈ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కోసం ప్రాణాల మీద కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పెళ్లికి ముందు ఫోటోషూట్స్, తరువాత, హనిమూన్ కు వెళ్ళినప్పుడు ఇలా ప్రతి ఒక్క సందర్భంలో ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా చాలా మంది రిస్క్ చేసి మరి కొత్త కొత్త స్టంట్ లు చేస్తూ ఫోటో షూట్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. అలా తాజాగా కూడా ఒక హనీమూన్ కపుల్ పెళ్లయి కనీసం 10 రోజులు కూడా కాకముందే కాళ్ల పారాణి కూడా ఆరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదాలు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల జూన్ 1 తేదీన వైద్యులు అయినా లోకేశ్వరన్, విభూషానికా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కోటి ఆశలతో వేదమంత్రాల సాక్షిగా ఈ జంట ఒకటయ్యారు. వీరిద్దరి పెళ్లి పూనమల్లిలోని ఒక కళ్యాణ మండపంలో గ్రాండ్ గా జరిగింది. వివాహం అనంతరం ఈ కపుల్స్ హనీమూన్ కోసం బాలికి వెళ్లారు. ఇక బాలిలో ఫోటో షూట్స్ కోసం ఒక బోట్ పై నిలుచుని ఫొటోస్ దిగుతుండగా ఇంతలోనే ఊహించిన విధంగా ఆ బోటు బోల్తాపడటంతో ఆ దంపతులిద్దరూ నీటిలో మునికి కాళ్ల పారాణి కూడా ఆరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

వెంటనే ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో వారు ఒక్కసారిగా గుండెలు పగిలిన రోదించారు. వెంటనే ఇరువురి కుటుంబ సభ్యులు బలికి చేరుకున్నారు. మొదట లోకేస్వరన్ మృతదేహాన్ని వెలికి తీయగా ఆ తరగతి విభూషాని మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే ప్రమాదానికి గల కారణం బోటు స్పీడ్ గా అని తెలుస్తోంది. వీరిద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులు చెన్నైకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆడుకోమని వేడుకున్నారు. అయితే ఇండోనేషియా నుంచి నేరుగా చెన్నైకి విమానాలు లేకపోవడంతో మొదట ఇండోనేషియా నుంచి మలేషియాకు తరలించి అక్కడి నుంచి తర్వాత భారత్ కి తీసుకురానున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో ఒక్కసారిగా తీరని విషాదాలు నెలకొన్నాయి.