Hair Fall: జుట్టు రాలుతోందా..? ఈ చిట్కాలు పాటించండి..!

చాలామంది జుట్టు రాలిపోతుంటే చూసి తట్టుకోలేరు. ఇక అమ్మాయిలైతే...

  • Written By:
  • Updated On - February 10, 2022 / 11:17 AM IST

చాలామంది జుట్టు రాలిపోతుంటే చూసి తట్టుకోలేరు. ఇక అమ్మాయిలైతే…వారి బాధను మాటల్లో చెప్పలేం. కేశాలే కదా వారి అందాన్ని రెట్టింపు చేసేవి. అందుకే జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. మహిళల పొడువాటి జుట్టు చూసి మంత్రముగ్దులవ్వని మగాళ్లు ఉండరు. జుట్టు ఎంత ఒత్తుగా, పొడుగ్గా ఉంటే వారు అంత అందంగా కనిపిస్తారు. జుట్టును బట్టి హేయిర్ స్టైల్స్ కూడా ఫాలో కావొచ్చు. అయితే కేశాలు కేవలం ఆడవారికే సొంతం కాదు…మగవారికి అందాన్ని ఇస్తాయి. కానీ మగవారు బట్టతల ప్రారంభం అవుతుందన్న సందర్భంలో కేశాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. సెలెబ్రెటిల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారికోసం పర్సనల్ గా హెయిర్ స్పెషలిస్టులు ఉంటారు. అయితే మనలో చాలామందికి ఆహారఅలవాట్లు, జీన్స్ వల్ల కూడా జుట్టు పెరగకపోవచ్చు. లేదా ఉన్న జుట్టు కాస్త ఊడిపోవచ్చు. జుట్టు రాలిపోతుంటే విలవిలలాడిపోయేవారు చాలా మంది ఉంటారు.

మరి జుట్టు పొడవుగా…పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. కొంతమందికి ఒత్తుగా పొడువుగా ఉండే జుట్టు ఉంటుంది. అలాంటి వారిని చాలామంది బాధపడుతుంటారు. అలాంటి జుట్టు మాకూ ఉంటే బాగుండు అనుకుంటారు. మరి అలాంటివారు కొన్ని ఇంటి చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.

* జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బాదం, ఆక్రోట్, నువ్వులు, అవిసెగింజలు ఇలాంటి వాటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ సమస్య నివారించడానికి సహాయపడతాయి.ఆహారంలో జాగ్రత్తలతోపాటుగా మీ లైఫ్ స్టైల్ లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.

* జుట్టు రాలుటకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి…అని వైద్యులు చెబుతుంటారు. కేవలం జుట్టు రాలే సమస్య కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న చాలా రకాల వ్యాధులకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని ప్రపంచ ఆహార సంస్థ వెల్లడించింది. మనం తీసుకునే ఆహార నియమాలే మెరుగైన శిరోజాలను సొంతం చేసుకోవడంలో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కోసం కార్బోహైడ్రెట్లు, ప్రొటీన్స్, కొవ్వులు, విటమిన్స్ తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

* ఇక మనం నిత్యం తీసుకునే ఆహారంలో ప్రొటీన్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. చికెన్, గుడ్లు, చేపలు ఇలాంటివి తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. వీటితోపాటుగా పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు కూడా అవసరం. వీటిన్నింటిలో ఐరన్, జింక్, మెగ్నేషియం, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టురాలకుండా చేయడంతోపాటు ఆరోగ్యంగా పెరగాడానికి సాయపడతాయి.