World Cup -Ahmedabad : వరల్డ్‌కప్ ఫైనల్ వేదిక.. అహ్మదాబాద్ అందాలు చూసేద్దాం

World Cup -Ahmedabad : ఇవాళ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతోంది. వరల్డ్ కప్ కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా ఇండియా,  ఆస్ట్రేలియా టీమ్స్ తలపడబోతున్నాయి. 

  • Written By:
  • Publish Date - November 19, 2023 / 08:30 AM IST

World Cup -Ahmedabad : ఇవాళ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతోంది. వరల్డ్ కప్ కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా ఇండియా,  ఆస్ట్రేలియా టీమ్స్ తలపడబోతున్నాయి.  ఈసందర్భంగా  అహ్మదాబాద్ నగరంలోని అపూర్వమైన, అద్భుతమైన టూరిస్టు స్పాట్‌లను ఒకసారి చూసేద్దాం..

సబర్మతీ ఆశ్రమం

జాతిపిత మహాత్మాగాంధీ 1917లో సబర్మతీ నది ఒడ్డున సబర్మతీ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమం స్వాతంత్ర్య ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సమీపంలోనే ఇది ఉంది. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత తన మిత్రుడు, బారిస్టర్ అయిన జీవన్‌లాల్ దేశాయ్‌కి చెందిన కొచరబ్ బంగ్లాలో 1915 మే 25న గాంధీ తన ఆశ్రమాన్ని ప్రారంభించారు. అయితే అక్కడ వ్యవసాయం చేయటానికి, పశువులను పెంచటానికి, ఇతరత్రా కార్యక్రమాలకు సరిపడా స్థలం లేకపోవటంతో ఈ ఆశ్రమాన్ని సబర్మతి నది కరకట్ట పక్కన ఉన్న 36 ఎకరాల స్థలంలోకి 1917 జూన్ 17న మార్చారు. అదే సబర్మతి ఆశ్రమంగా పేరొందింది.

We’re now on WhatsApp. Click to Join.

హాతీ సింగ్  జైన దేవాలయం

ఇది హాతీ సింగ్  జైన దేవాలయం. దీన్ని 1848లో సంపన్నుడైన జైనుడు నాగర్‌షేత్ హాతీ సింగ్ నిర్మించారు. ఆయన 49 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆ తర్వాత ఆయన భార్య శేతాని హర్కున్వర్బాయి ఆలయం నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ఈ జైన దేవాలయంలో 15వ తీర్థంకరుడు ధర్మనాథ్ కొలువై ఉన్నారు.  ఈ ప్రాంగణంలో 52 ఇతర జైన తీర్థంకరులకు అంకితం చేయబడిన ఉప క్షేత్రాలు కూడా ఉన్నాయి. 78 అడుగుల ఎత్తైన మహావీర్ స్తంభం ఉంది.  అప్పట్లోనే ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అహ్మదాబాద్‌లోని అత్యంత అందమైన దేవాలయాలలో ఇది ఒకటి.

సిది సయ్యద్ జాలీ

అహ్మదాబాద్‌లోని సిది సయ్యద్ మసీదు జాలీలు ఇలా అందమైన డిజైన్లతో ఉంటాయి. దీన్ని షేక్ సయీద్ అల్-హబ్షి సుల్తానీ 1572-73లో నిర్మించారు. వాస్తవానికి గతంలో ఈ ప్రదేశంలో ఒక చిన్న ఇటుక మసీదు ఉండేది. దాన్నే షేక్ సయీద్ అల్-హబ్షి సుల్తానీ పునర్నిర్మించారు. 1576లో ఆయన మరణించాక.. ఈ మసీదు సమీపంలోనే ఖననం చేశారు. IIM అహ్మదాబాద్ చిహ్నంలోనూ సిది సయ్యద్ మసీదు యొక్క ‘ట్రీ ఆఫ్ లైఫ్’ కనిపిస్తుంది.

కంకారియా సరస్సు

ఇది అహ్మదాబాద్‌లోనే అతిపెద్దదైన కంకారియా సరస్సు. నగరంలోని మణినగర్ ప్రాంతంలో ఇది ఉంది. ఈ సరస్సు మధ్యలో ఒక తోట ఉంది. ఈ సరస్సు పాత పేరు హౌజ్-ఏ-కుతుబ్. దీన్ని 1451లో సుల్తాన్ కుతుబ్ ఉద్దీన్ కట్టించారు. 2008లో ఈ సరస్సును పునరుద్ధరించారు. ఈ సరస్సు వృత్తాకారంలో ఉంటుంది. దీని చుట్టుపక్కల జూ, రైలు బండి, కిడ్స్ సిటీ, బెలూన్ రైడ్, వాటర్ రైడ్, వాటర్ పార్క్, భోజన శాలలు ఉంటాయి. సరస్సు తవ్వకం టైంలో కంకర రాళ్ళు బయల్పడటంతో దీనికి కంకారియా అనే పేరు వచ్చిందని అంటారు. సుల్తాన్ కుతుబుద్దీన్ సరస్సును నిర్మించేందుకు సరైన ప్రదేశం సూచించమని షాహ్ ఆలం అనే మునిని కోరగా.. ఆయన విసిరిన కంకర రాళ్ళ మధ్యలోనే సరస్సును తవ్వారని చెబుతారు. ఇంకో వాదన ప్రకారం తవ్వకాలు జరిపే సమయంలో షాహ్ ఆలం పాదానికి కంకర రాళ్ళతో గాయమైందని, అందుకే ఈ పేరు వచ్చిందని ప్రతీతి.

అక్షరధామ్ ఆలయం

గుజరాత్‌లోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి అక్షరధామ్ టెంపుల్. ఇది 23 ఎకరాలలో విస్తరించి ఉంది. స్వామినారాయణుడు ఈ ఆలయానికి అధిష్టాన దేవత. 6000 టన్నుల గులాబీ ఇసుకరాయితో దీన్ని నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ ఒక తోట ఉంది. ఇందులో గుర్రపు స్వారీలు, ఆటలు, పిల్లల కోసం స్వింగ్‌లు, హెర్బల్ గార్డెన్, సరస్సు, జలపాతం ఉన్నాయి. సందర్శకులకు ఆలయం గురించి అవగాహన కల్పించేందుకు మూడు ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో జరిగే సత్-చిత్-ఆనంద్ వాటర్ షో కూడా ఉంది. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది అహ్మదాబాద్ సిటీ సెంటర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ బావిని అదాలజ్ కి వావ్ అని పిలుస్తారు. వీర్‌సింగ్ వాఘేలా భార్య రూడీబాయి ఈ బావిని అదాలజ్ గ్రామం సరిహద్దులో నిర్మించింది. అప్పట్లో దీని నిర్మాణానికి రూ.5 లక్షలు ఖర్చు పెట్టారు.

Also Read: Polling Booth : ఇక పోలింగ్ కేంద్రాలను గూగుల్ మ్యాప్‌లో చూసుకోవచ్చు