Gold- Silver: ఈరోజు బంగారం కొనాలనుకునేవారికి నిరాశ.. ధరలు ఎలా ఉన్నాయంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు స్వల్పంగా పెరిగాయి.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 07:24 AM IST

Gold- Silver: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,950గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.79,300కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (సెప్టెంబర్ 24, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: World Bank Warning : పద్ధతి మార్చుకోకుంటే.. పాక్ కు పేదరికమే గతి : వరల్డ్ బ్యాంకు

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,100గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,210 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,230గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,950 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,800 ఉండగా, ముంబైలో రూ.75,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.79,300 ఉండగా, కోల్‌కతాలో రూ.75,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,250 ఉండగా, కేరళలో రూ.79,300గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,300 ఉండగా, విజయవాడలో రూ.79,300 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.