Gold- Silver Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,960గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.77,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (అక్టోబర్ 28, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: BellyFat : ఈ నాలుగు టిప్స్ పాటిస్తే.. పొట్ట దగ్గరి కొవ్వు కొవ్వొత్తిలా కరగడం ఖాయం..
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,110గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,250గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,960 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,960గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,960గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,600 ఉండగా, ముంబైలో రూ.74,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, కోల్‌కతాలో రూ.74,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,750 ఉండగా, కేరళలో రూ.77,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, విజయవాడలో రూ.77,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.