Gold- Silver Prices: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Prices) నేడు భారీగా తగ్గాయి.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 07:22 AM IST

Gold- Silver Prices: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Prices) నేడు భారీగా తగ్గాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,750గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,730గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.77,600కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (సెప్టెంబర్ 27, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Virat Kohli ODI Retirement: 2023 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డే, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు..?!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,880గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,730 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,730గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,730గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,800 ఉండగా, ముంబైలో రూ.74,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,600 ఉండగా, కోల్‌కతాలో రూ.74,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, కేరళలో రూ.77,600గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,600 ఉండగా, విజయవాడలో రూ.77,600 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.