Site icon HashtagU Telugu

EPFO: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు పదే పదే క్లెయిమ్ తిరస్కరణలకు చెక్‌..!

PF Interest Rate

PF Interest Rate

పీఎఫ్‌ (PF) క్లెయిమ్ ను వివిధ కారణాలతో పలుమార్లు తిరస్కరిస్తున్నారని, అలాగే నిర్ణేత సమయంలో క్లెయిమ్ ను పరిష్కరించడం లేదని పీఎఫ్‌ (PF) ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు సభ్యులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఈపీఎఫ్‌ఓ (EPFO) చర్యలు తీసుకుంటోంది. పీఎఫ్‌ క్లెయిమ్ ను తర్వగా పరిష్కరించడం కోసం ప్రాసెసింగ్‌లో జాప్యాన్ని తగ్గించాలని, ఒకే క్లెయింను పదేపదే తిరస్కరించకుండా చూసుకోవాలని తమ ఫీల్డ్‌ కార్యాలయాలను కోరింది. ఈపీఎఫ్‌ఓ (EPFO) ఫీల్డ్‌ ఆఫీసులకు ఇటీవల విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నియమాల ప్రకారం ప్రతి క్లెయింనూ మొదటిసారే క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ క్లెయిమ్ సరిగ్గా లేకపోతే తిరస్కరించవచ్చు. అయితే తిరస్కరణకు గల అన్ని కారణాలను ఒకేసారి ఈపీఎఫ్‌ సభ్యుడికి తెలియజేయాలి.

ప్రాంతీయ లేదా అదనపు పీఎఫ్‌ కమిషనర్‌ వారి అధికారిక పరిధిలోని పీఎఫ్‌ క్లెయిమ్ తిరస్కరణ బాధ్యత వహిస్తారు. ప్రతినెలా తిరస్కరణకు గురైన క్లెయిమ్ లో 50 లేదా 1%, ఏది ఎక్కువగా ఉంటే.. అన్ని క్లెయిమ్ ను విశ్లేషించి సంబంధిత డేటాను సమీక్ష కోసం జోనల్‌ కార్యాలయానికి సమర్పించాలి. గతేడాదిలో ఈపీఎఫ్‌ఓ దాదాపు 4 కోట్ల క్లెయిమ్ ను క్లియర్‌ చేసింది. ఈపీఎఫ్‌ సభ్యులు వివిధ కారణాల (ఇల్లు నిర్మాణం, వివాహం, ఉద్యోగం కోల్పోవడం)తో పీఎఫ్‌ మొత్తాన్ని పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ విత్‌డ్రా చేసుకునే వీలుంది. విత్‌డ్రా కోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతికంగా పీఎఫ్‌ క్లెయిమ్ ను 20 రోజుల్లోపు పరిష్కరించవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు, కేవైసీ, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో పీఎఫ్‌ క్లెయిమ్ లు తరచూ తిరస్కరణకు గురవుతుంటాయి.

Also Read:  AAP: 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర.. ఢిల్లీలో ఆప్ విజయం..!

Exit mobile version