Suvarnabhumi Fraud: ఫ్లాట్ల విక్రయాల పేరుతో సువర్ణభూమి మోసాలు బట్టబయలు

హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కుతుంది. గత ఐదేళ్ళలో నగర అభివృద్ధి కేవలం రియల్ ద్వారానే సాధ్యమైంది.

Published By: HashtagU Telugu Desk
Suvarnabhumi Fraud

New Web Story Copy (79)

Suvarnabhumi Fraud: హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కుతుంది. గత ఐదేళ్ళలో నగర అభివృద్ధి కేవలం రియల్ ద్వారానే సాధ్యమైంది. ప్రస్తుతం హైదరాబాద్ విదేశాలను తలపిస్తుంది. అయితే ఇదే అదునుగా కొందరు రియల్టర్స్ మోసాలకు పాల్పడుతున్నారు. జీవితకాలం దాచుకుని సొంతింటి కళను నెరవేర్చుకోవాలనుకునే అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్ లో రియల్ సంస్థగా చెప్పుకునే సువర్ణభూమిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లాట్లు విక్రయిస్తామంటూ పలువురి వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి జరిగిన మోసాన్ని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులు సువర్ణభూమిలో కీలక వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సువర్ణభూమి డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్, ఉద్యోగులు గంగిరెడ్డి, దస్తగిరిపై కేసులు నమోదు చేశారు.

సువర్ణభూమి చేసిన మోసం ఏంటంటే.. సువర్ణభూమి 2017లో షాద్ నగర్ సమీపంలో సువర్ణ కుటీర్ పేరుతో వెంచర్ మొదలుపెట్టింది. అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు విడతల వారీగా సొమ్ము చెల్లించారు. దాదాపు 50 లక్షలు చెల్లించారని బాధితులు చెప్తున్నారు. అయితే సగమే చెల్లించారని, పూర్తిగా చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని సంస్థ బురిడీ కొట్టించింది. అయితే బాధితులు మాత్రం మొత్తం చెల్లించిన రశీదులను చూపిస్తే.. అందులో కొన్ని రశీదులు ఫేక్ అంటూ సువర్ణభూమి సంస్థ కొట్టిపారేసింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సువర్ణభూమి డెవలపర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ బొల్లినేని శ్రీధర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్, ఉద్యోగులు గంగిరెడ్డి, దస్తగిరిపై కేసులు నమోదు చేశారు.

Read More: Uttar Pradesh: దారుణం.. షార్ట్ సర్క్యూట్ తో ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవదహనం?

  Last Updated: 15 Jun 2023, 07:07 PM IST