Site icon HashtagU Telugu

Charlapally: 430 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్

Railway Project

Railway Project

చర్లపల్లి రైల్వే టెర్మినల్లో 430 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రయాణికులకు అనేక వసతుల ఏర్పాటు చేయబడుతున్నాయి. అధిక ప్రయాణికుల రాక పొకలకు అనుగుణంగా కొత్తగా నిర్మితమౌతున్న ఈ స్టేషన్ భవనం అత్యంత ఆధునికంగా మరియు సౌందర్య వంతమైన ముఖ్య ద్వారంతో నిర్మించడం జరుగుతోంది.

ఈ స్టేషన్ భవనం లో గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ మరియు మొదటి అంతస్తులో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలకు మరియు పురుషులకు కోసం విశ్రాంతి గదులు ఉంటాయి. స్టేషన్ భవనంలో విశాలమైన కాన్కోర్స్ ప్రాంతాలు మరియు స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్వ్యవస్థ ఏర్పాటు చేయబడుతోంది.

అదనంగా 4 అదనపు ఎత్తైన ప్లాట్ఫారమ్లు ఉంటాయ మరియు ఇప్పటికే ఉన్న 5 ప్లాట్ఫారమ్లు కూడా పూర్తి నిడివితో పునర్నిర్మాణం చేయబడి రైళ్లను నిర్వహించడానికి సిద్దంచేయ బడ్డాయి. రెండు కొత్త ఫుట్ ఓవర్ బ్రైడ్స్ – ఒకటి 12 మీటర్ల వెడల్పు మరియు మరొకటి 6 మీటర్ల వెడల్పు – ప్లాట్ఫారమ్ల మధ్య కదలికను సులభతరం చేయడానికి. ఇంకా, మొత్తం 9 ప్లాట్ఫారమ్లలో ఎస్కలేటర్లు మరియు లిఫ్టులు ఉంటాయి, అంటే మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ప్రయాణీకుల కదలికను సులభతరం చేయడానికి. ఈ స్టేషన్ నుండి రైళ్లను ప్రారంభించేందుకు కోచ్ నిర్వహణ సౌకర్యాలను కూడా కలిగి ఉన్నాయి.