Kedarnath Temple: మరో 6 నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయం తలుపులు మూసివేత!

కేదార్ నాథ్ టెంపుల్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ టెంపుల్ ని కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు.

Published By: HashtagU Telugu Desk
Kedarnaths Temple

Kedarnaths Temple

కేదార్ నాథ్ టెంపుల్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ టెంపుల్ ని కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు. మిగిలిన ఆరు నెలలు కూడా ఈ గుడి తలుపులు మూసి వేస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర ముగిసింది. తాజాగా కేదార్ నాథ్ ధామ్ తలుపులను మూసివేశారు. శీతాకాలం మొదలైన కారణంగా ఈ ఆలయ తలుపులను మూసివేశారు. హిమపాతం శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలలో చార్ ధామ్ లు మూసి వేయబడతాయి. ఈ ఆలయాలను తిరిగి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో తెలుస్తారు.

దీంతో ఉదయం పూజా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత తలుపులను మూసివేసి ఆ తర్వాత ఆర్మీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శివయ్య పంచముఖీ దేవతా విగ్రహం శ్రీ ఓంకారేశ్వరం ఉఖీమఠ్ కు వేలాది మంది భక్తులు జై బోలో శంకర్ అన్న నినాదాలతో స్వామి వారి వెంట నడిచారు. ఇక వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆలయం తలుపులు మూసి వేయబడతాయి. ఈ మేరకు ఆలయాల తలుపులు మూసి వేయడానికి పూజారులు సన్నాహాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఆలయంతో పాటుగా యమునా గుడి తలుపులను కూడా నేడు మూసివేశారు.

కాగా శని మహారాజు నేతృత్వంలోని యమునా దేవి నేడు యమునోత్రి ధామ్ నుండి బయలుదేరి శీతాకాల విడిది స్థలం అయినా గ్రామానికి ఖర్సాలీ  చేరుకో నుంది. అలాగే రేపు నెల అనగానే నవంబర్ 18 శుక్రవారం రెండవ కేదార మద్మహేశ్వర, నవంబర్ 7వ తేదీన మూడవ కేదార తుంగనాథ్ ఆలయ తలుపులను కూడా మూసివేయనున్నారు. ఆ తరువాత చార్ ధామ్ యాత్ర మే 3, 2022 అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభం కానుంది. ఇకపోతే ప్రభుత్వ లెక్కల అంచనా ప్రకారం ఇప్పటివరకు దాదాపుగా 42 లక్షల మంది యాత్రికులు చార్ ధామ్ యాత్రకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

  Last Updated: 27 Oct 2022, 04:10 PM IST