Site icon HashtagU Telugu

2000 Note: రూ.2 వేల నోట్లు మారుస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు!

Rs 2000 Note Exchange

Rs 2000 Note Exchange

2000 Note: రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. మంగళవారం నుంచి రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్పిడి చేసుకునే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి వాటికి బదులుగా వేరే డినామినేషన్ నోట్లు తీసుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం కల్పించింది. ఆ తర్వాత కూడా డేట్‌ను పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ సారి ఆర్బీఐ చర్యలు చేపట్టింది.

బ్యాంకులతో పాటు ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి కూడా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అలాగే రోజుకు రూ.4 వేల పరిమితి వరకు బీసీల ద్వారా కూడా రూ.2 వేల నోట్లు మార్పిడి చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తి కూడా ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఒకేసారి రూ.20 వేల వరకు మాత్రమే రూ.2 వేల నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ ఒకరోజులో మార్చుకోవడానికి లేదు. అయితే బ్యాంకు అకౌంట్లో రూ.2 వేల నోట్లను ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. బ్యాంకు అకౌంట్ లో జమ చేసి ఆ తర్వాత తీసుకోవచ్చు.

రూ.2 వేల నోట్లు మార్చుకోవడానకి ఎలాంటి ఐడెంటిటి కార్డు అవసరం లేదు. పాన్ కార్డు, ఆధార్ కార్డు లాంటివి అవసరం లేదు. అలాగే డిపాజిట్ ఫారం లేదా మరో ఫాంరను ఏది పూర్తి చేయాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 30 తర్వాత చట్టబద్దమైన టెండర్ గా రూ.2 వేల నోట్లు కొనసాగుతున్నాయి. అయితే రూ.2 వేల నోట్లను షాపుల్లో ఇచ్చి ఏవైనా కొనుగోలు చేయవచ్చు. ఏదైనా లావాదేవీల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. మార్చి 31 2018 నాటికి రూ.6.73 లక్షల కోట్ల నోటు సర్కులేషన్ లో ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3.62 లక్షలకు తగ్గింది. అందే కేవలం 10.8 శాతం మాత్రమే చలామణిల ఉంది.