Site icon HashtagU Telugu

Alert : సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ ఆర్థిక అంశాల్లో భారీ మార్పులు..!!

Money

Money

ప్రతీ నెల ప్రారంభంతో ఏదొక మార్పు జరుగుతూనే ఉంటుంది. అలాగే నేటి నుంచి కూడా కొన్ని ఆర్థిక అంశాలలోనూ మార్పులు రాబోతున్నాయి. వీటివల్ల మనపై ప్రభావం పడుతుంది కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. National pension schemనుంచి మొదలుకుని ఇన్సూరెన్స్ ప్రీమియంలదాకాచాలా మార్పులు జరగనున్నాయి. కాబట్టి వాటిని గమనించడం చాలా ముఖ్యం. NPSరూల్స్ లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీలో పలు మార్పులు చేసింది. ఇవి నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఎన్ పీఎస్ అకౌంట్ తెరిస్తే కమిషన్ లభించనుంది. వీటితోపాటు ఇతర ప్రయోజనాలను పీఓపీలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది.

ఇక టోల్ ట్యాక్సుల్లోనూ మార్పులు రానున్నాయి. యమున ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ టోల్ ట్యాక్సును పెంచేలాన్న నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుంది. సెప్టెంబర్ 1,2022 నుంచి UPలోని ఘజియాబాద్ లో ప్రాపర్టీల ధరలు పెరగనున్నాయి. 2 శాతం నుంచి 4 శాతానికి పెంచుతున్నట్లు సమాచారం.

ఇక ఎలక్ట్రిసిటీని పంజాబ్ ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. డొమెస్టిక్ కన్జూమర్లకు ప్రతినెలా ఫ్రీగా 3వందల యూనిట్ల విద్యుత్ ను అందజేస్తామని పంజాబ్ సర్కార్ ఇప్పటికే తెలిపింది. అలాగే LPGధరలు పెట్రోలీయం కంపెనీలు మార్చాయి. ఈ సారి ధరలు భారీగా తగ్గించాయి.