Ram Darshan Timings: అయోధ్య బాల‌రాముడి దర్శనం వేళల్లో మార్పులు..!

తాజాగా అయోధ్య ఆలయ అధికారులు బాలరాముడి దర్శనం (Ram Darshan Timings) సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించారు.

  • Written By:
  • Updated On - January 25, 2024 / 11:39 AM IST

Ram Darshan Timings: అయోధ్యలో రామమందిరప్రాణ ప్రతిష్ట పూర్తయినప్పటి నుంచి దేశం నలుమూలల నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నారు. తొలి రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో రామభక్తులు దర్శనానికి వచ్చారు. జనవరి 23 నుంచి రామాలయం దర్శనం కోసం తెరవబడింది. భక్తుల భద్రత కోసం పోలీసులు, అధికారులు ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేశారు. బుధవారం (జనవరి 24) 2.5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించగా, మొదటి రోజు 5 లక్షల మంది ద‌ర్శించుకున్నార‌ని రామ్ మందిర్ ట్రస్ట్ తెలిపింది.

తాజాగా అయోధ్య ఆలయ అధికారులు బాలరాముడి దర్శనం (Ram Darshan Timings) సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించారు. అలాగే అయోధ్యకు వచ్చే సెలబ్రిటీలు, వీఐపీలు వారం రోజులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయలేదని అధికారులు తెలిపారు.

Also Read: Mamata Banerjee: ప్ర‌మాదంపై స్పందించిన ప‌శ్చిమ బెంగాల్ సీఎం.. డ్రైవ‌ర్ లేకుంటే ప్రాణాలు పోయేవ‌ని ఎమోష‌న‌ల్‌..!

జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం జనవరి 23 నుంచి సామాన్య ప్రజలకు దర్శనానికి తెరలేపారు. భగవంతుని దర్శనం మంత్రముగ్ధులను చేస్తుందని భ‌క్తులు అంటున్నారు. అంతకుముందు శ్రీరాముని దర్శనానికి ఉదయం 7 గంటల నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు నిర్ణయించబడింది. అయితే ఇప్పుడు ఆలయంలో దర్శన సమయం మారింది. ఇప్పుడు భగవంతుడు 15 గంటల పాటు దర్శనం ఇవ్వ‌నున్నాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాంలాలా భక్తులకు దర్శనం ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు 15 నిమిషాల పాటు స్వామివారి నైవేద్యం, హారతి కోసం మాత్రమే మూసివేయబడతాయని అధికారులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.