చంద్రయాన్-3 (Chandrayaan 3 )లో అపూర్వ ఘట్టానికి సమయం ఆసన్నమైంది. విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) జాబిల్లి (Moon)పై మరికొద్ది గంటల్లో దిగబోతుంది. ఈ క్షణం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. కానీ విక్రం ల్యాండింగ్ అనేది అంత ఈజీ కాదు భారీ సవాళ్లతో కూడుకున్నది. చంద్రుడిపై ఎక్కవ ధూళి ఉంటుంది. ఉపరితలానికి దగ్గరగా ఆన్‌బోర్డ్ ఇంజిన్‌లను కాల్చడం ద్వారా వేడి వాయువులు, ధూళి వెనుకకు వెళ్తాయి. చంద్ర ధూళి సోలార్ ప్యానెల్, ఇతర సాంకేతిక మిషన్ల పనితీరుకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
Read Also : Chandrayaan – 3 Landing in 4 Stages : చివరి 17 నిమిషాలలో.. 4 దశల్లో ల్యాండింగ్.. వివరాలివీ
ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ (Nilesh Desai) ప్రకారం.. చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఆగస్ట్ 23న ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి దిగేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో దాని వేగం సెకనుకు 1.68 కిమీ ఉంటుంది. ఆ వేగాన్ని తగ్గించడంపైనే ఇస్రో దృష్టి ఉంటుందని ఆయన తెలిపారు. ఎందుకంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ల్యాండర్ వేగంపై ప్రభావం చూపుతుందన్నారు. ఆ వేగాన్ని నియంత్రించకపోతే, క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ల్యాండింగ్ అయ్యే క్షణాలు ఎంతో ఉత్కంఠతో కూడుకుంది.
Read Also : PM Modi – Chandrayaan 3 : మూన్ ల్యాండింగ్ ను ప్రధాని మోడీ.. దక్షిణాఫ్రికా నుంచి ఇలా వీక్షిస్తారట !
బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు ఇస్రో చంద్రయాన్-3 జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాడింగ్ (Vikram Lander Landing) చేయనుంది. ఈ అపూర్వఘట్టాన్ని వీక్షించేందుకు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. అలాగే ఈ ప్రయోగం సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఈ కీలక ఘట్టాన్ని వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ఈ పూర్తి ప్రక్రియ 20 నిమిషాల పాటు ఉంటుంది. ఇది సక్సెస్ అయితే ఇండియా చరిత్ర సృష్టిస్తుంది. ఈ 20 నిమిషాల కీలక సమయాన్ని టీ-20 (టెర్రర్-20) అని పిలుస్తున్నారు. చంద్రుడిపై అన్వేషణ కోసం గత నెల 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం నేడు జాబిల్లిని తాకనుంది.
జాబిల్లిపై అన్వేషణకు భారత్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, సోవియెట్ యూనియన్, చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా నిలుస్తుంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగానూ చరిత్ర సృష్టించనుంది.
Read Also : Chandrayaan3 – Gadwal Techie : చంద్రయాన్-3లో తెలుగు తేజం.. సాఫ్ట్ వేర్ టీమ్ లో గద్వాల్ టెకీ