Site icon HashtagU Telugu

Chandrayaan 3 Date : చంద్రయాన్ 3 లాంచ్ డేట్ పై క్లారిటీ.. జులై మూడో వారంలో ముహూర్తం

Chandrayaan 3 Date

Chandrayaan 3 Date

Chandrayaan 3 Date : చంద్రయాన్‌-3  మిషన్ లక్ష్యం.. చంద్రుడిపై  సక్సెస్ ఫుల్ గా ల్యాండర్ ను ల్యాండ్ చేయించడం.భారత్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మిషన్ జూలై 12 నుంచి 19వ తేదీల మధ్య జరగనుంది. ఈవిషయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు. ఈ  ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయి.  ఇందుకోసం LVM-3 అనే రాకెట్‌ను ఉపయోగించబోతున్నారు. ఇప్పుడు దాని అసెంబ్లింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే  LVM-3 రాకెట్‌ లోని అన్ని భాగాలు యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ నుంచి శ్రీహరికోటకు చేరుకున్నాయని సోమనాథ్ తెలిపారు.ఈ నెలాఖరులోగా రాకెట్‌ అసెంబ్లింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాత చంద్రయాన్‌-3ని రాకెట్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతుంది. అయితే, అన్ని పరీక్షలు విజయవంతంగా జరిగితేనే.. జూలై 12 నుంచి 19వ తేదీల(Chandrayaan 3 Date) మధ్య చంద్రయాన్‌-3  మిషన్ ను లాంచ్  చేస్తామని  చెప్పారు.

Also read : Antarctica To Shadnagar : అంటార్కిటికా టు షాద్‌నగర్.. ఇస్రో 110 కోట్ల ప్రాజెక్ట్

ప్రయోగ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చంద్రయాన్-3లోని హార్డ్‌వేర్, స్ట్రక్చర్, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, సెన్సర్లలో దిద్దుబాట్లు చేశామని ఇస్రో చైర్మన్‌ చెప్పారు. “గత ప్రయోగానికి ఈ ప్రయోగానికి తేడా ఏమిటంటే..  ఈసారి మిషన్ కు  మరింత ఇంధనం జోడించబడింది.  ల్యాండింగ్ కాళ్ళు మరింత బలోపేతం చేయబడ్డాయి. మరింత శక్తి ఉత్పత్తి కోసం పెద్ద సోలార్ ప్యానళ్ళను అమర్చాము. మరో అదనపు సెన్సార్ కూడా జోడించబడింది” అని వివరించారు. “చంద్రయాన్‌-3  వేగాన్ని కొలిచేందుకు గత సంవత్సరం అభివృద్ధి చేసిన ‘లేజర్ డాప్లర్ వెలోసిమీటర్’ పరికరాన్ని జోడించాం. మేము దాని అల్గారిథమ్‌ను కూడా మార్చాము.. చంద్రయాన్‌ను మరొక ప్రాంతంలో ల్యాండ్ చేసేలా సహాయపడటానికి కొత్త సాఫ్ట్‌వేర్ జోడించబడింది” అని ఇస్రో చీఫ్ చెప్పారు.

Exit mobile version