Site icon HashtagU Telugu

Chandrayaan 3 Today : ఇవాళ మధ్యాహ్నం నింగిలోకి “చంద్రయాన్‌ 3”

Helicopter Drop Chandrayaan 3

Helicopter Drop Chandrayaan 3

Chandrayaan 3 Today : ఈరోజు మధ్యాహ్నం 2:35:13 గంటలకు చంద్రయాన్‌-3 ప్రయోగం జరగబోతోంది.. 

ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై భారత జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం4 వాహకనౌక దూసుకెళ్లనుంది. 

ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా నిలుస్తోంది.    

Also read : Siddhu Jonnalagadda : చిరంజీవి సినిమాలో ఆఫర్‌కి నో చెప్పిన డీజే టిల్లు??

చంద్రయాన్‌-3  ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ గురువారం మధ్యాహ్నం(Chandrayaan 3 Today) 1.05 గంటలకు ప్రారంభమైంది. ఇది ఈరోజు మధ్యాహ్నం వరకు (దాదాపు 25 గంటల పాటు) కొనసాగనుంది.ఎల్‌వీఎం3-ఎం4 వాహకనౌకలో ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో అనుసంధానమై ఉంటాయి. దాదాపు 3,84,000 కి.మీ ప్రయాణించిన తర్వాత చంద్రుడి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఎల్‌వీఎం3-ఎం4 వాహకనౌక చేరుకుంటుంది. ఆ తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ల్యాండ్‌ అవుతుంది. ల్యాండర్‌ లోపలే రోవర్‌ ఉంటుంది. ల్యాండర్‌ ల్యాండ్ అయిన తర్వాత రోవర్ బయటికి వెళ్లి చంద్రుడిపై తన రీసెర్చ్ ను మొదలుపెడుతుంది. ఈసారి (చంద్రయాన్‌-3లో) ఆర్బిటర్‌ ను చంద్రుడిపైకి పంపడం లేదు. ఎందుకంటే ఇంతకుముందు (2019లో) చంద్రయాన్‌-2లో భాగంగా పంపిన ఆర్బిటర్‌ ఇంకా యాక్టివ్ గానే ఉంది. అది చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. దాన్నే ఇప్పుడు వినియోగించుకోనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

Also read :France Highest Award To PM Modi : ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం.. ఏడేళ్లలో అందుకున్న 14 పురస్కారాలివే

రోవర్ సేకరించే సమాచారం ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ రూపంలో ల్యాండర్ కు.. ల్యాండర్ నుంచి ఆర్బిటర్‌ కు.. ఆర్బిటర్ నుంచి ఇస్రో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సమాచార బదిలీ జరుగుతుంది. ఈసారి ల్యాండింగ్‌ కోసం కొంత విశాలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్‌-3 ల్యాండర్ లోని ఇంధన నిల్వ ట్యాంకు సైజును పెంచామని, ఒకచోట కుదరకుంటే మరోచోటుకు ల్యాండర్ ను పంపి ల్యాండింగ్ చేయిస్తామని అంటోంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహక నౌకలను ల్యాండ్‌ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్‌ ప్రయత్నిస్తోంది. 2019లో చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయించడంలో ఇస్రో విఫలమైంది.